: ఏపీ, తెలంగాణాల్లో రద్దయిన 17 రైళ్లు ... ఆ వివరాలు!


భారీ వర్షాల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో నడిచే 17 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 24 రైళ్లను దారి మళ్లిస్తున్నట్టు తెలిపింది. రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న కారణంగా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. రద్దయిన రైళ్లలో వికారాబాద్ నుంచి గుంటూరు వెళ్లే పల్నాడు ఎక్స్ ప్రెస్; గుంటూరు, మాచర్ల మధ్య తిరిగే పాసింజర్; సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఇంటర్ సిటీ; మాచర్ల నుంచి భీమవరం వెళ్లే ప్యాసింజర్; రేపల్లె, సికింద్రాబాద్ మధ్య నడిచే ప్యాసింజర్ సర్వీసులు ఉన్నాయి. వీటితో పాటు నడికుడి - మాచర్ల, పిడుగురాళ్ల - మిర్యాలగూడ, మాచర్ల - గుంటూరు ప్యాసింజర్ సర్వీసులు ఉన్నాయి. ఈ రైళ్ల రాకపోకలను నిలిపివేశామని, తదుపరి సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది తిరిగి తెలుపుతామని అధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News