: ‘హోదా’ కోసం రేపు ప్రవాసాంధ్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించనున్న జగన్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రజలకి దాని ఆవశ్యకతను తెలియజెప్పడానికి నడుం బిగించిన ఏపీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రేపు ప్రవాసాంధ్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇదే అంశంపై ముచ్చటించనున్నారు. హైదరాబాద్‌లోని తమ పార్టీ ఆఫీసు నుంచి భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమవుతుంది. రాష్ట్రానికి హోదా సాధించాల్సిన అవసరంపై ఆయన వివరించి చెప్పనున్నారు.