: ‘లంక’ గ్రామాల్లో కూలీల ఆర్తనాదాలు
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు ముఖ్యంగా ‘లంక’ గ్రామాల్లో కృష్ణానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ గ్రామాల్లో చిక్కుకుపోయిన కూలీలు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గుంటూరు జిల్లాలో దెబ్బతిన్న రైల్వే లైన్లకు మరమ్మతుల కారణంగా విజయవాడ మీదుగా రైళ్లు నడిపేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్ లో రూట్ ఇంటర్ లాకింగ్ పనులు పూర్తి అయ్యాయి. ఈ రోజు సాయంత్రం నుంచి విజయవాడ మీదుగా రైళ్లు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.