: బీఎస్ఎఫ్ అదుపులో పాకిస్థాన్ దేశీయుడు


భారత్ సరిహద్దుల్లోకి అక్రమంగా ప్రవేశించిన ఒక పాకిస్తాన్ దేశస్తుడిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సిబ్బంది అదుపులోకి తీసుకుంది. ఈ తెల్లవారుజామున జమ్మూకాశ్మీర్ లోని పర్ గ్వాల్ సెక్టార్ లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. భారత్ లోకి చొరబడ్డ పాక్ దేశీయుడిని వారు గుర్తించారు. వెంటనే అతని మొబైల్ ఫోన్ ను వారు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ అతని పేరు అబ్దుల్ ఖయూమ్ అని గుర్తించారు. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News