: మరో ఆఫర్.. కొత్తగా మరో 4జీ డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఎయిర్‌టెల్‌


రిలయన్స్‌ జియో నుంచి వ‌స్తోన్న పోటీని ఎదుర్కోవ‌డానికి తమ క‌స్ట‌మ‌ర్ల‌కు ఇప్ప‌టికే ఎన్నో ఆఫ‌ర్‌లు ప్ర‌క‌టించిన ఎయిర్‌టెల్ తాజాగా మ‌రో కొత్త ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది. తాము తాజాగా తీసుకొస్తోన్న ఈ 4జీ ప్యాక్ ద్వారా త‌మ వినియోగ‌దారులు 90 రోజుల పాటు ఉచితంగా ఇంటర్నెట్‌ను వాడుకోవ‌చ్చ‌ని పేర్కొంది. ఈ ప్యాక్ కావాల‌నుకునే త‌మ పాత క‌స్ట‌మ‌ర్లు రూ.1,495తో రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపింది. కొత్తగా త‌మ సిమ్‌కార్డుల‌ను తీసుకున్న వారు రూ.1,494తో రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంద‌ని చెప్పింది. ఈ ప్యాక్ తొలుత ఢిల్లీలో మాత్రమే లభ్యం కానుందని పేర్కొంది. దేశంలోని మిగ‌తా అన్ని రాష్ట్రాల్లోనూ త్వ‌ర‌లోనే ఈ ఆఫ‌ర్‌ను అందుబాటులో ఉంచుతామ‌ని తెలిపింది. తాము ప్ర‌క‌టించిన ఈ ఆఫ‌ర్‌తో త‌మ క‌స్ట‌మ‌ర్లు 24 గంటలూ ఆన్‌లైన్‌లో ఉండవ‌చ్చ‌ని, తరచూ రీఛార్జ్‌లు చేసుకునే అవ‌స‌రం కూడా ఉండ‌బోద‌ని ఎయిర్‌టెల్ పేర్కొంది.

  • Loading...

More Telugu News