: కాలిబాట వంతెన ధ్వంసం...వంద గ్రామాలకు నిలిచిన రాకపోకలు


విశాఖపట్టణం జిల్లాలోని దేవరాపల్లి మండల కేంద్రం సమీపంలో శారదానది పొంగి ప్రవహిస్తోంది. వరద ఉద్ధృతికి దేవరాపల్లి సమీపంలోని కాలిబాట వంతెన దెబ్బతింది. ఈ కాలివంతెన బాటపై సుమారు వంద గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. వివిధ ప్రాంతలతో దేవరాపల్లిని ఈ కాలిబాట వంతెన కలుపుతుంది. ఇది ధ్వంసం కావడంతో సుమారు వంద గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. వెంకటరాజపురం గ్రామంలో వరదనీటిలో పడి ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. రైవాడ జలాశయానికి వర్షపునీరు పోటెత్తుతోందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News