: అమెరికా నటి భారతీయ పెంపుడు కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి


అమెరికా నటి మియా ఫారోస్ భారతీయ పెంపుడు కొడుకు థాడియస్ విల్క్ (27) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. కోల్ కతాలోని అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న థాడియస్ విల్క్ ను ఫారోస్ దత్తత తీసుకున్నారు. పోలియో కారణంగా నడుము కింది భాగం చచ్చుపడిపోవడంతో అతను కేవలం చక్రాల కుర్చీకి మాత్రమే పరిమితమయ్యాడు. కనెక్టికిట్ లోని రోక్స్ బరీలోని ఫారోస్ నివాసంలో ఉంటున్న అతడు, తమ ఇంటికి 39 కిలోమీటర్ల దూరంలో రోడ్డు ప్రమాదానికి గురై మణించాడని పోలీసులు తెలిపారు. ఈ మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. అతని మరణం వెనుక వాస్తవాలు పోస్టు మార్టం తరువాత తెలిసే అవకాశం ఉండగా, అతని మరణం వెనుక కుట్ర కోణం కనిపించడం లేదని పోలీసులు ప్రకటించారు. కాగా, థాడియస్ మృతిపై మియా ఫారోస్ తరపు ప్రతినిధులు ఎటువంటి ప్రకటన చేయలేదు.

  • Loading...

More Telugu News