: రేపు, ఎల్లుండి జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు సెలవు


హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. దీంతో, జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు రేపు, ఎల్లుండి సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈఓ సోమిరెడ్డి ఒక ప్రకటన చేశారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయం కావడం, కొన్ని ప్రాంతాల్లోని పాఠశాలల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News