: ఢిల్లీలో రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన తెలంగాణ సీఎం కేసీఆర్
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి నిన్న ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు కూడా కేంద్రమంత్రులతో చర్చలు జరుపుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన కేంద్రమంత్రి దత్తాత్రేయను కలిసి పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, హైకోర్టు విభజన, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలపై ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రి చందూలాల్ పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.