: ‘స్విస్ ఛాలెంజ్ విధానంపై కేసు’లో ఎలా ముందుకు వెళదాం?.. కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం
విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశమైంది. ఇటీవలే యూరిలో పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరులైన జవాన్లకు మంత్రివర్గం శ్రద్ధాంజలి ఘటించింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఆ బోర్డులోని సెలెక్షన్ కమిటీ సభ్యుడు, గుంటూరుకు చెందిన ఎమ్మెస్కే ప్రసాద్ ఎన్నికయిన విషయం తెలిసిందే. దీంతో మంత్రివర్గం ఆయనకు అభినందనలు తెలిపింది. నిన్న ఢిల్లీలో ఉమాభారతి ఆధ్వర్యంలో జరిగిన అపెక్స్ కమిటీ భేటీలోని అంశాలు, వచ్చే నెల 3 నుంచి అమరావతి నుంచి ప్రభుత్వ పాలన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో చర్చిస్తున్నారు. అంతేగాక, అమరావతి నిర్మాణానికి అనుసరిస్తోన్న స్విస్ ఛాలెంజ్ విధానంపై వేసిన కేసుపై కూడా ఆయన చర్చిస్తున్నారు.