: రాజమండ్రి-విశాఖ రాకపోకలకు తీవ్ర అంతరాయం
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం వాహనాల రాకపోకలపై పడింది. రాజానగరం మండలం సూర్యరావుపేట వద్ద గల 16వ జాతీయ రహదారిపై వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో రాజమండ్రి-విశాఖపట్నం మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరదనీరు కాలువను తలపిస్తుండటంతో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో, ప్రయాణికులకు దిక్కుతోచడం లేదు.