: శని ఉపగ్రహంపై మేఘాలు... అద్భుతమంటున్న శాస్త్రవేత్తలు


సౌరకుటుంబంలో శనిగ్రహంగా పిలుచుకునే శాటరన్ కున్న ఉపగ్రహం టైటాన్... మనకు తెలిసినంతవరకూ అచ్చం భూమిలాంటి గ్రహం ఇదొక్కటే. సౌర వ్యవస్థలో మరే గ్రహమూ భూమిని పోలినట్టుగా లేదన్నది అందరికీ తెలిసిన సత్యమే. ఈ శని ఉపగ్రహంపై మేఘాలు పట్టాయి. ఇంతకాలం టైటాన్ పై మిథేన్ గడ్డకట్టిన రూపంలో ఉందని, కొన్ని చోట్ల ద్రవ రూపంలోనూ ఉన్న కారణంగా ఈ గ్రహంపై కొన్ని రకాల ప్రాణుల జీవనానికి అవకాశం ఉందని భావిస్తూ వచ్చిన శాస్త్రవేత్తలు, ఇంతవరకూ దానికి సాక్ష్యాలను కనుగొనలేకపోయారు. ఇప్పుడు తాజాగా, టైటాన్ పై మేఘాలను నాసా వాయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ చిత్రీకరించింది. ఇలా మేఘాలు కనిపించడం అద్భుతమని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేఘాల్లో కార్బన్, నైట్రోజన్ కలగలిసిన డైసియానోసెట్లేన్ (సీ4ఎన్2) ఉందని, ఈ కారణంగానే టైటాన్ నారింజ రంగులో కనిపిస్తూ ఉంటుందని తేల్చారు. ఈ మేఘాలను మరింత నిశితంగా పరిశీలిస్తున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News