: భారీ వర్షాలతో హైదరాబాద్ పాతబస్తీలో కూలిన పురాతన పెంకుటిల్లు
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి తడిసిన పాత భవనాలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. కొద్ది సేపటి క్రితం పాతబస్తీ మాదన్నపేటలోని రెయిన్ బజార్‌లో పెంకుటిల్లు కుప్పకూలింది. ఆ ఇల్లు 80 ఏళ్ల పురాతనమైనదిగా తెలుస్తోంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. పాత భవనాలను స్వచ్ఛందంగా ఖాళీ చెయ్యాలని ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సూచించారు. మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అవకాశాలు లేకపోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.