: ఢిల్లీలో బిజీబిజీగా ముఖ్యమంత్రి కేసీఆర్
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కూడా తన పర్యటనలో కేంద్రమంత్రులు, పలువురు అధికారులతో చర్చలు జరుపుతూ బిజీబిజీగా ఉన్నారు. కొద్ది సేపటి క్రితం ఆయన ఢిల్లీలో కేంద్రమంత్రి దత్తాత్రేయను కలిసి, పలు అంశాలపై చర్చించారు. కేసీఆర్‌తో పాటు మంత్రి చందూలాల్ పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. మరికాసేపట్లో ఆయన ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాధికారులతో తెలంగాణలోని పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.