: గుంటూరులో భారీ వరదలు.. కుప్పగంజి వాగులో కొట్టుకుపోయిన నలుగురు యువకులు
గుంటూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల ఇళ్లు, అపార్ట్‌మెంట్లు నీళ్లలో మునిగిపోయాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తాడు సాయంతో వారు చెరువులని తలపిస్తున్న నీటిలో నడుస్తూ ఒక చోటు నుంచి మరోచోటుకి వెళుతున్నారు. జిల్లాలోని నాదెండ్ల మండలం గణపవరం వద్ద వరద ప్రవాహం ముంచుకొచ్చింది. కుప్పగంజి వాగులో నలుగురు యువకులు కొట్టుకుపోయారు. సాయం చేయాలంటూ ఆర్తనాదాలు పెట్టారు. నీటిలో కొట్టుకుపోతున్న ఓ యువకుడు చెట్టుని పట్టుకొని దాని పైకి ఎక్కాడు. యువకులను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు.