: నేడు ఏలూరులో వైసీపీ యువభేరి ... హోదా ప్రయోజనాలపై యువతతో జగన్ చర్చ!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో యువభేరి నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ యువభేరి సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలపై జగన్ యువతీయువకులతో చర్చించనున్నారు. ప్రధానంగా యువతలో ప్రత్యేకహోదాపై అవగాహన కల్పించనున్నారు. తుని ఘటనలో వైఎస్సార్సీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న సమయంలో జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో యువభేరి సదస్సు నిర్వహించడం పార్టీకి కలిసొచ్చే అంశం అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ సభకు భారీ ఎత్తున యువత హాజరువుతుందని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.