: ప్రత్యేకంగా ఉమాభారతితో భేటీ అయిన చంద్రబాబు
సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఈ భేటీ జరిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో చెప్పలేని కొన్ని విషయాలను ఉమాభారతికి విన్నవించుకున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ లో పొందుపరిచిన అంచనాలు తప్పుగా ఉన్నాయని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందని ఆమెను కోరారు. ఇతర ప్రాజెక్ట్ లకు సంబంధించిన అంశాలను కూడా ఆయన ప్రస్తావించినట్లు సమాచారం.