: కాపులకు, బీసీలకు మధ్య మంటపెట్టాలని బాబు చూస్తున్నారు: అంబటి రాంబాబు
కాపులకు, బీసీలకు మధ్య మంటపెట్టి చలికాగాలని ఏపీ సీఎం చంద్రబాబు చూస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపులకు వ్యతిరేకంగా బీసీలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని, మంజునాథ కమిషన్ ఎక్కడికి వెళ్తే అక్కడ టీడీపీ నేతలు గొడవలు చేస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. బీసీలకు నష్టం లేకుండా రిజర్వేషన్ కల్పించాలని కాపులు కోరుకుంటున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, కాపులను బీసీల్లో చేర్చాల్సిందేనని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.