: కేసీఆర్ నుంచి బొకే తీసుకుని ఓ గులాబీని లాగి చంద్రబాబుకిచ్చిన ఉమాభారతి


ఈ మధ్యాహ్నం ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ లు కృష్ణా జలాల పంపిణీపై అపెక్స్ కమిటీ ముందు వాదనలు వినిపించేందుకు ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఉమాభారతి వద్దకు వెళ్లిన సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉమాభారతికి అభివందనం చేస్తూ, కేసీఆర్ గులాబీలతో కూడిన పుష్పగుచ్ఛాన్ని ఆమెకు ఇచ్చారు. చిరునవ్వుతో దాన్ని తీసుకున్న ఉమాభారతి, అప్పటికే అక్కడికి చేరుకున్న చంద్రబాబును కేసీఆర్ కు చూపించగా, ఇద్దరు నేతలూ కరచాలనం చేసుకున్నారు. ఆ వెంటనే కేసీఆర్ తనకిచ్చిన గులాబీ ఫ్లవర్ బొకే నుంచి ఓ పువ్వును లాగి ఆమె చంద్రబాబుకు ఇచ్చారు. ఆపై మరో పువ్వును లాగి కేసీఆర్ చేతిలోనూ పెట్టారు. ఈ ఘటనను అక్కడున్న మంత్రులు దేవినేని ఉమ, హరీశ్ రావు ఇతర అధికారులు చిరునవ్వుతో తిలకించారు.

  • Loading...

More Telugu News