: రావులపాలెం సమీపంలోని వాడపాలెంలో ఉద్రిక్తత
తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం సమీపంలోని కొత్తపేట శివారు వాడపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికంగా రేగిన చిన్న గొడవ రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది. దీంతో ఆ గ్రామంలోని ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి, ఇళ్లపై పరస్పర దాడులకు దిగారు. ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయని సమాచారం. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు... ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇరువర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీఎత్తున పోలీసులను మోహరించారు.