: ముడుపులు తీసుకుని వ్యాట్ ఎత్తివేశారు: సీఎంపై టీడీపీ ఆరోపణ
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై టీడీపీ నేడు తీవ్ర ఆరోపణలు చేసింది. వస్త్ర వ్యాపారులపై వ్యాట్ ఎత్తివేస్తూ నిన్న సీఎం తీసుకున్న నిర్ణయం వెనుక కోట్లాది రూపాయలు చేతులు మారాయని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. ఈ వ్యవహారంలో రూ. 50 కోట్ల మేర ముడుపులు చేతులు మారాయని అన్నారు. సీఎం సోదరులు సంతోష్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డిలు ఒకరు హైదరాబాద్ నుంచి మరొకరు చిత్తూరు నుంచి పైరవీలు చేస్తున్నారని కూడా ముద్దుకృష్ణమ నాయుడు చెప్పారు. 'వ్యాట్ ఎత్తివేత' భాగోతంలో మంత్రుల బృందానికీ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు.