: హైదరాబాద్‌లో వర్షం.. వాహనాల రాకపోకలకు అంతరాయం
హైదరాబాద్‌ని వర్షం ఈరోజు సాయంత్రం మరోసారి పలకరించింది. శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, ఎస్సార్‌నగర్, యూసఫ్‌గూడ, అమీర్‌పేట, ఎర్రగడ్డతో పాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. కూకట్‌పల్లి ప్రాంతంలో చిరుజల్లులు పడ్డాయి. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లిహిల్స్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లిలో జల్లులు కురిశాయి. చిన్నపాటి వర్షానికే ఆయా ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వాహనాలు నత్తనడకన ముందుకు వెళుతున్నాయి.