: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సురేఖా వాణి కాలా ఛష్మా వీడియో
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖా వాణి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివిధ సినిమాల్లో వదిన, అక్క పాత్రలతో సెలబ్రిటీ హోదా సంపాదించిన సురేఖా వాణి... కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్ర జంటగా నటించిన 'బార్ బార్ దేఖో' సినిమాలో పాప్యులర్ సాంగ్ 'కాలా ఛష్మా'కు కుమార్తెతో కలిసి కాలు కదిపింది. నవ యువతిలా జీన్స్ షార్ట్ (పొట్టి నిక్కరు) వేసుకున్న సురేఖా వాణి కుమార్తెతో కలిసి పోటాపోటీగా డ్యాన్స్ చేయడంతో టాలీవుడ్ అభిమానులు ఈ వీడియోను లైకులు, కామెంట్లు, షేర్లో హోరెత్తిస్తున్నారు. మీరు కూడా ఆ వీడియోను చూడండి.