: శ్రీనగర్ విమానాశ్రయంలో కూలిన మిగ్-21 విమానం
శ్రీనగర్ విమానాశ్రయం వద్ద ఈరోజు మిగ్-21 విమానం కుప్పకూలింది. విమానాన్ని ల్యాండింగ్ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే పైలట్ సురక్షితంగా బయటపడ్డాడని అధికారులు తెలిపారు. విమానం కూలడంతో అక్కడి రన్ వే పూర్తిగా ధ్వంసమైంది. ఎయిర్పోర్టులో విమానసర్వీసులు నిలిపివేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది ఆ ప్రాంతంలోని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపమే ఈ ఘటనకు కారణమయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.