: పాతబస్తీలో రౌడీషీటర్ హత్య
హైదరాబాద్ పాతబస్తీలోని షహీన్ నగర్ లో అమర్ హంసన్ అనే రౌడీషీటర్ గుర్తుతెలియని వ్యక్తులు చేసిన దాడిలో హతమయ్యాడు. దుండగులు తమతో తెచ్చుకున్న ఇనుపరాడ్లతో హంసన్ తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.