: నేను సిక్కు అమ్మాయిని...ఇలా చేయకూడదు.. అయినా సరే చేస్తున్నా: తాప్సీ


బాలీవుడ్ సినిమా 'పింక్' హిట్ టాక్ తెచ్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన తాప్సీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయిన తాప్సీకి తొలి హిట్ లభించడంతో విజయం అందించిన ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. ఈ సందర్భంగా 'పింక్' ప్రమోషన్ లో పాల్గొన్న తాప్సీ దర్శకుడు షుజిత్ సర్కార్ కాళ్లకు నమస్కరించింది. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ, తాను సిక్కు యువతినని, సిక్కు మతానికి చెందిన వారు ఒక వ్యక్తి కాళ్లు పట్టుకోకూడదని, అయినప్పటికీ తాను ఇలా ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నానని చెప్పింది. అమితాబ్ బచ్చన్, తాప్సీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా బాలీవుడ్ లో కలెక్షన్లలో దూసుకుపోతోంది. మూడు రోజుల్లో 21.51 కోట్ల రూపాయలు వసూలు చేసి సత్తాచాటుతోంది.

  • Loading...

More Telugu News