: నా ప్రేమను ఆమె అంగీకరించేందుకు మూడేళ్లు పట్టింది: యువరాజ్ సింగ్
హేజెల్ తో తన ప్రేమను అంగీకరించేలా చేసుకునేందుకు మూడేళ్లు పట్టిందని టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో యువరాజ్ మాట్లాడుతూ, ‘హేజెల్ నాతో ఒకసారి కాఫీకి వస్తానని చెప్పింది. తీరా చెప్పిన సమయానికి హ్యాండిచ్చింది. ఫోన్ చేస్తే.. స్విచ్ఛాఫ్ చేసింది. కాఫీ కలిసి తాగేందుకే కాదు, నా ప్రేమను అంగీకరించేలా చేసేందుకూ మూడేళ్లు పట్టింది. నా ప్రేమను ఆమె ఒప్పుకోగానే హేజెల్ తల్లిదండ్రులను కలిసి మాట్లాడాను’ అని యువీ చెప్పుకొచ్చాడు. కాగా, యువీ, హేజెల్ ల పరిచయం ‘ఫేస్ బుక్’ ద్వారా ఏర్పడింది. వాళ్లిద్దరికీ ఉన్న ఒక కామన్ ఫ్రెండ్ సాయంతో హాజెల్ ను యువీ కలవాలనుకున్నాడు. నానా తిప్పలు పడి.. ఒక ఏడాది తర్వాత హేజెల్ ను కలిశాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. వచ్చే డిసెంబర్ మొదటివారంలో వీరి వివాహం జరగనుంది. హేజెల్ తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు కనుక ఆ సాంప్రదాయంలో యువీ, హేజెల్ లు ఒకటి కానున్నట్లు సమాచారం.