: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.90 వేల కోట్లను కేసీఆర్ ఏం చేశారో చెప్పాలి: ఉత్తమ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చాక తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదని అన్నారు. కేసీఆర్ ఫిరాయింపులను మాత్రమే ప్రోత్సహిస్తూ పాలన కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన రూ.90 వేల కోట్ల నిధులను కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని ఆయన అన్నారు. ప్రభుత్వం చేపడుతోన్న సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబంలో తప్ప ప్రజల్లో సంతోషమేలేదని ఆయన అన్నారు.