: నా పుట్టిన రోజు బహుమతి చాలా బాగుంది: షబానా అజ్మీ
ప్రముఖ నటి షబానా అజ్మీ పుట్టిన రోజును పురస్కరించుకుని అమీర్ ఖాన్ భార్య ఇచ్చిన బహుమతి చాలా బాగుందని ఆమె తెలిపారు. డిసెంబర్ లో విడుదల కానున్న 'దంగల్' సినిమాను షబానా అజ్మీ పుట్టిన రోజు గిఫ్ట్ గా అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు చూపించారు. ఈ సినిమా చూసిన షబానా అజ్మీ నటీనటులను మెచ్చుకున్నారు. ఈ మేరకు తన పుట్టిన రోజును పురస్కరించుకుని 'దంగల్' సినిమాను కిరణ్ రావు చూపించారని అన్నారు. దీంతో తనకు మరువలేని బహుమతి ఇచ్చినట్టైందని ఆమె చెప్పారు. 'దంగల్'లో అమీర్ ఖాన్, నితేష్ తివారీ, కిరణ్ రావు, ఫాతిమా, సనా నటన అద్భుతంగా ఉందని ఆమె పేర్కొన్నారు. కుస్తీ యోధుడు మహవీర్ సింగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇలాంటి కథతోనే 'సుల్తాన్' రూపొంది, విజయం సాధించిన సంగతి తెలిసిందే. క్రిస్ మస్ ను పురస్కరించుకుని అమీర్ ఖాన్ ఈ సినిమాను విడుదల చేయనున్నాడు.