: నయీమ్ కేసులో రాజకీయ నాయకుల లింకులపై సిట్ అధికారుల దృష్టి.. రెండు టీమ్‌ల ఏర్పాటు
ఇటీవల తెలంగాణ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు విడిచిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో నయీమ్ కేసుల్లో పోస్టుమార్టం రిపోర్టులు తప్పుగా ఇచ్చినట్లు భావిస్తోన్న వైద్యులకు ఈరోజు నోటీసులు జారీ చేశారు. అలాగే నయీమ్ కేసులో రాజకీయ నాయకుల లింక్‌లపై సిట్ అధికారులు దృష్టి పెట్టారు. అందుకోసం ఆధారాల సేకరణకు రెండు టీమ్‌లను ఏర్పాటు చేశారు. నయీమ్ కేసులో ఇప్పటి వరకు లభించిన డాక్యుమెంట్లు, కీలక ఆధారాలను నార్సింగి నుంచి సిట్ కార్యాలయానికి పోలీసులు తరలించారు. పూర్తి ఆధారాలు లభ్యమైన తర్వాత రాజకీయ నాయకులకు నోటీసులు అందజేసి, వారిని విచారిస్తామని సిట్ అధికారులు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపే కేసును ముగించనున్నట్లు తెలిపారు.