: బాధను వెల్లడించేందుకు మాటలు రావడం లేదు: మమతా బెనర్జీ


జమ్మూకాశ్మీర్ లోని యూరీ సెక్టార్ పై జరిగిన ఉగ్రదాడిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. ఈ ఘటనలో తమ రాష్ట్రానికి చెందిన ఇద్దరు సైనికులు అమరులయ్యారని ఆమె ట్వీట్ చేశారు. యూరీ సెక్టార్ ఘటనలో 17 కుటుంబాలు తమకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తులను కోల్పోయాయని అన్నారు. అమర జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఆమె చెప్పారు. కాగా, హౌరా జిల్లాలోని జమునాబాలియాకు చెందిన గంగాధర్, 24 పరణాల జిల్లాలోని గంగాసాగర్ ప్రాంతానికి చెందిన బిశ్వజిత్ లు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు కావడం విశేషం.

  • Loading...

More Telugu News