: షాబుద్దీన్ బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ
బీహార్ లో 11 సంవత్సరాల జైలు జీవితం అనంతరం విడుదలైన ఆర్జేడీ నేత షాబుద్దీన్ బెయిల్ ను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన బెయిల్ పై స్టే ఇవ్వాలంటూ, నితీశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై వాదోపవాదనలు జరుగగా, కేసులో షాబుద్దీన్ వాదనను సైతం వినాల్సి వుందని సుప్రీం అభిప్రాయపడింది. స్టే ఇవ్వలేమని స్పష్టం చేసిన న్యాయమూర్తి, షాబుద్దీన్ కు నోటీసులు ఇస్తూ, కేసు విచారణను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. రెండు హత్య కేసుల్లో నేరం రుజువు కావడంతో 2005 నవంబర్ నుంచి జైల్లో ఉన్న షాబుద్దీన్ ఇటీవల బెయిల్ పై బయటకు రావడం జరిగింది. ఆ తరవాత జరిగిన చట్ట ఉల్లంఘనలు, బాధితుల ఆందోళనల నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం బెయిల్ పై స్టే కోరుతూ సుప్రీంను ఆశ్రయించింది.