: ఆగ్నేయ చైనాలోని యునాన్లో వందలాది గ్రామాల్లో బురద కష్టాలు
చైనాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. చైనాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి, బురదతో కూడిన వరదతో ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కుంటున్నారు. ఆగ్నేయ చైనాలోని యునాన్లో వందలాది గ్రామాల్లో ఈ బురద కష్టాలు ఏర్పడ్డాయి. బురదలోనే కొన్ని ఇళ్లు మునిగిపోతున్నాయి. ఆ ప్రాంతంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. పరిస్థితులని మెరుగుపరచేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. బురదలో చిక్కుకుపోయిన ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.