: నాంపల్లి టీఎన్జీవో భవన్‌లో ఉద్రిక్తత.. పెట్రోలు బాటిళ్లతో తెలంగాణ ఉద్యోగుల బైఠాయింపు


హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీకి కేటాయించిన ఫోర్త్‌క్లాస్ తెలంగాణ ఉద్యోగులు.. తమను తిరిగి తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. గేటు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి పెట్రోలు బాటిళ్లతో కార్యాలయంలో బైటాయించారు. తమకు న్యాయం జరగకపోతే చావే శరణ్యమని చెబుతున్నారు. తమను తెలంగాణకు కేటాయించకపోతే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. గ్రూప్ ఫోర్ ఉద్యోగులు గత రెండేళ్లుగా ఈ విషయంపై ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సుమారు 700 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను వెంటనే తెలంగాణకు బదిలీ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News