: నేను యావరేజ్ ముఖ్యమంత్రిని: రోశయ్య
‘నేను యావరేజ్ ముఖ్యమంత్రిని అని అనుకుంటున్నాను’ అని తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధామిచ్చారు. ‘ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వీటన్నింటిని సర్దుబాటు చేయడం, ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమ పరిస్థితులు, పరిణామాలు మొదలైన వాటిని నాకు చేతనైన పద్ధతిలో ఎదుర్కొన్నాను. అందుకనే, నేను యావరేజ్ ముఖ్యమంత్రిని’ అని రోశయ్య అన్నారు.