: కత్రినాపై 98.5% మంది అసూయపడుతున్నారు: రాంగోపాల్ వర్మ
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కు స్మితా పాటిల్ స్మారక పురస్కారం ప్రకటించడంపై సామాజిక మాధ్యమాల్లో పలు విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన దైన శైలిలో స్పందించారు. కత్రినాకు మద్దతుగా నిలిచారు. కత్రినా కైఫ్ కు ఈ అవార్డు రావడంపై 98.5 శాతం మంది అసూయతో కామెంట్స్ చేస్తున్నారని, 1.5 శాతం మాత్రం వాళ్లేం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియదని వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు చేశారు. స్మితా పాటిల్ సినిమాల్లోకి రాకముందే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారని, కత్రినా మాత్రం అలా కాదని.. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు వచ్చి అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకుందన్నారు. ఎన్నో నైపుణ్యాలున్న స్మితా పాటిల్ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదన్నారు. ఈ పురస్కారం కత్రినా కైఫ్ కు దక్కడం, ఆమె కంటే స్మితా పాటిల్ కే ఎక్కువ గౌరవమన్నారు.