: ఉగ్రవాదులకు ‘పాక్’ మద్దతిస్తోంది: రాజ్ నాథ్ సింగ్


ఉగ్రవాదులకు పాకిస్థాన్ మద్దతిస్తోందని, ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తోందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. రాజ్ నాథ్ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రా, ఐబీ, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జమ్మూకాశ్మీర్ లోని యురి సెక్టార్ పై జరిగిన ఉగ్రవాదుల దాడిపై చర్చించారు. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్ సీఎం, గవర్నర్ తో రాజ్ నాథ్ మాట్లాడారు. పాకిస్థాన్ ను ఓ ఉగ్రవాద దేశంగా భావించి అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News