: 10 కోట్ల మంది చనిపోయినా ఫర్వాలేదు..‘పాక్’ పై భారత్ యుద్ధం ప్రకటించాలి: జేసీ దివాకర్ రెడ్డి


పది కోట్ల మంది ప్రజలు చనిపోయినా ఫర్వాలేదు.. పాకిస్థాన్ పై భారత్ యుద్ధం ప్రకటించాలని, ‘అఖండ భారత్’గానే ఉంటే బాగుంటుందంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘పాక్’ను స్వాధీనం చేసుకుని అఖండ భారత్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ తప్పిదం వల్లే పాకిస్థాన్ ఏర్పాటు అయిందని, అప్పటి నేతలు ఇటువంటి పరిస్థితులు తలెత్తుతాయని ఊహించలేకపోయారని అన్నారు. రోజూ చచ్చి బతికే కన్నా, యుద్ధమే శరణ్యమని అన్నారు. కాగా, జమ్మూకాశ్మీర్లోని యూరి సెక్టార్ పై ముష్కరులు దాడి నేపథ్యంలోనే జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News