: చరిత్రలో అత్యధికం... యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 1,635 కోట్లు సమీకరించిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్


భారత ప్రైవేటు బీమా కంపెనీల్లో అతిపెద్దదైన ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ ఐపీఓ రేపు ప్రారంభం కానుండగా, యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటికే రూ. 1,635 కోట్లను సంస్థ సమీకరించింది. యాంకర్ ఇన్వెస్టర్ విభాగంలో ఓ సంస్థ చేసిన అతిపెద్ద పెట్టుబడుల సమీకరణ ఇదే. భారత మార్కెట్లో ఐపీఓకు వస్తున్న తొలి బీమా కంపెనీగా ఇప్పటికే రికార్డులకు ఎక్కిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన రావచ్చని అంచనా. కాగా, మోర్గాన్ స్టాన్లీ, నోమురా, గోల్డ్ మన్ సాక్స్, ఎల్అండ్ టీ ఎంఎఫ్, బిర్లా సన్ లైఫ్ ఎంఎఫ్, ఎడిల్ వైజెస్ ఎంఎఫ్, సుందరం ఎంఎఫ్ తదితర కంపెనీలు ఐసీఐసీఐలో యాంకర్ ఇన్వెస్టర్లుగా పెట్టుబడులు పెట్టి వాటాలను పొందారు. పబ్లిక్ ఇష్యూను లీడ్ చేసే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్లు 20 శాతం వాటాను ముందుగానే తమకు నచ్చిన పెట్టుబడిదారులను, మూలాధార ఇన్వెస్టర్లుగా ప్రకటిస్తూ, వారికి వాటాలను విక్రయించుకోవచ్చన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News