: 'పెదరాయుడు' సినిమాకి నాకు చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా... ఓ కడియమిచ్చి పంపించాడు!: రజనీకాంత్ రాసిన లేఖను చదివిన మంచు లక్ష్మి


"'పెదరాయుడు' సినిమా షూటింగ్ సందర్భంగా తొలిషాట్ ను హీరోపై తీయాల్సి ఉంది. అలాంటి సమయంలో ముహూర్తం షాట్ కోసం అందరూ ఎదురు చూస్తుండగా, మోహన్ బాబు ఆ షాట్ నాపై తీయాలని అడిగాడు. దీంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ క్లాప్ కొట్టగా, నాగేశ్వరరావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా తొలి షాట్ చిత్రీకరించిన క్షణాలను నా జీవితంలో మర్చిపోలేను. ఆ సినిమా షూటింగ్ పూర్తైన తరువాత నాకు చిల్లిగవ్వ కూడా ఇవ్వని మోహన్ బాబు యాంటిక్ పీస్ అని ఆ సినిమాలో నేను ధరించిన కడియాన్ని నాకు ఇచ్చి, తిరుపతి నుంచి చెన్నైకి పంపేశాడు. అయినా సరే వాడికి ఆ సినిమా కాసులు కురిపించింది. ఎక్కడున్నా వాడు బాగుండాలి. మోహన్ బాబు నా కంటే మంచి నటుడు. నేను మళ్లీ చెబుతున్నా... మోహన్ బాబు నా కంటే మంచి నటుడు అని తనే చెప్పమన్నాడు. నేను అబద్ధం ఆడను" అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభినందన సందేశంలో పేర్కొన్నారు. ఆయన రాసిన ఆ లేఖను మంచు లక్ష్మి చదివి వినిపించింది.

  • Loading...

More Telugu News