: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాస...వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల తోపులాట


చిత్తూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో నిధుల దుర్వినియోగంపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మేయర్ ను నిలదీశారు. దీంతో మేయర్ సమాధానం చెప్పేందుకు నీళ్లు నమలగా, టీడీపీ కార్పొరేటర్లు కల్పించుకుని సమాధానాలు చెప్పడం ప్రారంభించారు. ఈ విధానంపై వైఎస్సార్సీపీ నేతలు అభ్యంతరం చెప్పారు. దీంతో టీడీపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. వాగ్వాదం తీవ్రం కావడంతో రెండు పార్టీల కార్పొరేటర్లు తోపులాటకు దిగారు. దీంతో మేయర్ ఇరు వర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కార్పొరేటర్లు పట్టించుకోకపోవడంతో సమావేశం రసాభాసగా మారింది.

  • Loading...

More Telugu News