: గాంధీభవన్ వద్ద నిరాహార దీక్ష చేస్తా: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోని గాంధీభవన్ వద్ద నిరాహర దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్, పంజాగుట్టలోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డిని కలిసిన ఆయన.. ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రైతులకు మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం మూడో విడత రైతు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేయనున్నట్లు తెలిపారు. ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు వెంటనే విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని ఆయన పేర్కొన్నారు. రుణాల వల్ల రైతులు పడుతోన్న కష్టాలను ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు.