: వైసీపీ నేత భూమనకు మరోసారి సీఐడీ నోటీసులు
కాపుల ఉద్యమంలో భాగంగా తునిలో జరిగిన విధ్వంసం ఘటనకు సంబంధించి విచారణకు రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డికి ఈరోజు సీఐడీ మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఎల్లుండి గుంటూరు సీఐడీ కార్యాలయానికి ఆయన రావాలని సూచించింది. ఈ నెల 6, 7 తేదీల్లోనూ భూమనను సీఐడీ అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. భూమనకు మళ్లీ సీఐడీ నోటీసులు రావడం పట్ల వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.