: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ ఫస్టియర్ విద్యార్థి ఈ తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ప్రవీణ్ నెల రోజుల క్రితమే హాస్టల్‌లో చేరాడు. తానుంటున్న గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రవీణ్ ఆత్మహత్యపై తోటి విద్యార్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.