: ముస్లింలు, లాటిన్ అమెరికా ప్రజలను వెళ్లగొట్టాలన్నదే ట్రంప్ లక్ష్యం: హిల్లరీ ఆరోపణ
అమెరికా నుంచి ముస్లింలు, లాటిన్ అమెరికా ప్రజలను వెళ్లగొట్టాలన్నదే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ లక్ష్యమని హిల్లరీ క్లింటన్ ఆరోపించారు. 39వ సీహెచ్సీఐ విందులో ఆమె నిన్నరాత్రి మాట్లాడారు. ట్రంప్ విభజనవాద రాజకీయాలు చేస్తున్నారని, నవంబరులో జరగనున్న ఎన్నికల్లో ట్రంప్ ను ఓడించాలని హిల్లరీ కోరారు. యూఎస్ అధ్యక్షుడు ఒబామా అమెరికాలో పుట్టినట్లు ట్రంప్ ఒప్పుకోకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. కాగా, ఇదే కార్యక్రమంలో ఒబామా తన ప్రసంగానికి ముందు హిల్లరీతో పావుగంట పాటు రహస్య సమావేశమయ్యారు.