: హైదరాబాద్‌లో భారీవర్షం... ట్రాఫిక్ ఇక్కట్లు!
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, హైటెక్‌సిటీ, చందానగర్, మణికొండ, నాంపల్లి, కూకట్‌పల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట ఎస్సార్‌నగర్, యూసఫ్‌గూడ, సనత్‌నగర్, ఎర్రగడ్డల్లో భారీ వర్షం పడుతోంది. ఆయా ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పంజాగుట్టలో నిలిచిన నీటితో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జూబ్లిహిల్స్ లో వాహనరాకపోకలు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో మీటరుకు పైగా వాహనాలు నిలిచిపోయినట్లు సమాచారం.