: మోదీతో నేపాల్‌ ప్రధాని ప్రచండ భేటీ


భార‌త్‌లో పర్యటిస్తోన్న నేపాల్ ప్రధానమంత్రి, మావోయిస్టు పార్టీ చీఫ్ పుష్ప కమాల్‌ దహాల్‌ అలియాస్‌ ప్రచండ ఈరోజు ఢిల్లీలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో స‌మావేశ‌మ‌య్యారు. గ‌త‌నెల 4న‌ నేపాల్ ప్ర‌ధానమంత్రిగా రెండోసారి బాధ్య‌త‌లు స్వీక‌రించిన ప్ర‌చండ తొలిసారిగా భార‌త్‌లో ప‌ర్య‌టిస్తూ ద్వైపాక్షిక సంబంధాలపై చ‌ర్చలు జ‌రుపుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... భారత్ తమకు మిత్రదేశమని అన్నారు. భార‌త్‌, నేపాల్ దేశాల మధ్య మత, సంస్కృతిక, చారిత్రక స‌త్సంబంధాలు బ‌లంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ ఆ దేశంతో భారత సంబంధాలు మ‌రింత మెరుగుపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్ర‌చండ‌ను భారత్‌లో ప‌ర్య‌టించాల్సిందిగా ఇటీవ‌లే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించిన సంగ‌తి విదిత‌మే. త‌న‌ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌చండ భారత్ లోని పలువురు నేతలతో చర్చించనున్నారు. ఇండియాలోని ప‌లు భారీ ప్రాజెక్టుల‌ను ఆయన ప‌రిశీలిస్తారు.

  • Loading...

More Telugu News