: హామీలు ఇచ్చాను, నిలబెట్టుకోలేకపోయాను... నా జీవితంలో విచారమిదే: అమితాబ్
తాను రాజకీయాల్లో చేరిన వేళ, ప్రజల నుంచి ఓట్లను రాబట్టుకునేందుకు ఫక్తు రాజకీయ నాయకుడి తరహాలో హామీలను గుప్పించానని, వాటిని నెరవేర్చడంలో మాత్రం విఫలమైన తనకు జీవితంలో మిగిలిన విచారం అదేనని బిగ్ బీ అమితాబ్ వ్యాఖ్యానించారు. 'ది కేఫ్' పేరిట నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఇండియాలో రాజకీయాల గురించి సినీ నటులు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాలు లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. తానిచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు ప్రయత్నించానని చెప్పిన అమితాబ్, కొన్ని భావోద్వేగాల మధ్య పాలిటిక్స్ లోకి ప్రవేశించానని, అలా చేయడం తప్పని తెలుసుకున్న తరువాత వెనక్కు వెళ్లానని అన్నారు. కాగా, రాజీవ్ గాంధీ పిలుపు మేరకు, 1984లో అలహాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీ పదవికి పోటీపడి విజయం సాధించిన అమితాబ్, ఆపై మూడేళ్లు పదవిలో ఉండి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.