: జెరూసలేం మత్తయ్య కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన సుప్రీం
తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసులో మధ్యవర్తిత్వం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న క్రైస్తవ సంఘాల నేత జెరూసలేం మత్తయ్య గతంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలన్న పిటిషన్ పెట్టుకోగా దానిపై హైకోర్టు సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసు నుంచి మత్తయ్యను తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. అయితే మత్తయ్య తరపు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.