: పెరిగిన పెట్రోల్, తగ్గిన డీజెల్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల కదలికలకు అనుగుణంగా నెలలో రెండుసార్లు పెట్రోల్, డీజెల్ ధరలను సవరిస్తున్న ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు, ఈ దఫా పెట్రోల్ ధరను పెంచుతూ, డీజెల్ ధరలను తగ్గిస్తున్నట్టు వెల్లడించాయి. తక్షణం అమల్లోకి వచ్చేలా పెట్రోలు ధరను 58 పైసలు పెంచుతూ, డీజెల్ ధరను 31 పైసలు తగ్గిస్తున్నట్టు ఓఎంసీలు ప్రకటించాయి. ఈ నెల ప్రారంభంలో పెట్రోలు ధరను రూ. 3.38, డీజెల్ ధరను రూ. 2.67 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే.